synopsis

బిజ్జుల వారి కుటుంబం గురించి సంక్షిప్తంగా :

ఒకప్పుడు సింధునది పరివాహక ప్రాంతంలో వెలసిన సింధు నాగరికత, అదే నేటి వాయువ్య ప్రాంత పాకిస్థాన్ లో వెలసిన భారత ద్రావిడ నాగరికతగా చరిత్రకారులు కనుగొన్నారు. సింధు, సరస్వతి నది ప్రాంతాలలో నివసించిన అంబాలకర్లు దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు అంబాల పట్టణం లో రహస్య ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రకంగా వలస వచ్చిన భారత ద్రావిడులు మరియు భారత ఆర్యన్ లు దక్షిణ భారతదేశానికి వచ్చి ఆర్యన్లుగా చెప్పుకోబడ్డారు. ఈ వలసలకు ముఖ్య కారణం సట్లేజ్ మరియు యమున నదుల ప్రవాహం మారడంతో సరస్వతి నది పూర్తిగా ఎండిపోవడమే.

ఆర్యన్ లు మధ్య ఆసియా నుంచి పంజాబ్ ప్రాంతానికి వచ్చినట్లు వేదాలలో కూడా తేల్చబడింది. ఇండస్ నాగరికతకు ఆర్యన్ క్షత్రీయులు, ఆర్యన్ మహారాజులు మరియు అప్పటి భారతదేశ రాజుల ద్వారా కాలచూరిల చరిత్ర మొదలయింది. ఈ కాలచురులు జైన మరియు శైవ మతాలను ప్రోత్సహించారు, ఐతే ఆర్య బ్రాహ్మణులకు మరియు ఆర్య క్షత్రీయులకు వివాదాలు మొదలై భారత ఆర్యన్ మహారాజుల పుట్టుకకు మరియు జైన, భౌద్ధ మతాల పుట్టుకకు కారణమైది.

 

పరశు రాముడి నాయకత్వంలో ఉన్న ఆర్య బ్రాహ్మణుల చేతిలో 21 మార్లు ఓటమిని భరించి అవమానాల పాలైన ఆర్య క్షత్రీయులు మరియు వారి నాయకుడైన సహస్రార్జునుడు అహింసా మార్గం ఉత్తమైనదని గ్రహించి అహింసనే ప్రాథమిక సిద్ధాంతంగా ఒక కొత్త మతాన్ని అవలంభించారు అదే జైన మతం. అప్పట్నుంచి ఆర్య బ్రాహ్మణులతో పూర్తిగా దూరమై పోయినారు. మొదటి తీర్థంకరుడైన రిషభదేవుడు రకరకాల వీలు విద్యలు ప్రజలకు నేర్పిచారు. అప్పట్లో ఉన్న రాజ్యానికి రిషభదేవుని పెద్ద కుమారుడైన భరతుడు చక్రవర్తిగా వుండినాడు. ఈ భరతుడు అనేక రాజ్యాలు జయించిన మహారాజు, ఈ చక్రవర్తి పేరు మీదనే ఈ మన ఉపకండానికి భారత్ అనే పేరు వచ్చింది. ఈ విషయాన్నీ జైన మరియు హిందూ మతాల సాహిత్యాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇరవై నాలుగు తీర్థంకర్లలో నలుగురు తీర్థంకరులు చక్రవర్తులే.

 

బిజ్జల వంశ వ్యవస్థాపకుడు సోమ. ఈ సోమ, మహాభారతలోని అశ్వథామ కి శిష్యుడు. ఈ సోముడు పరశురామున్నుంచి కాపాడుకొనుటకు పెద్ద పెద్దగా గడ్డం, మీసాలు పెంచి తన ఉనికిని దాచుకొనేవాడు. అక్కడి నుండి ఈ సోముడు వారి వారసులు కూడా కాలచుర్లుగా పిలువబడ్డారు. ఎందుకంటే (ఎందుకనగా), కల్ల అనగా పెద్ద మీసాలు చూరి అనగా పదునైన కత్తి. రాజవంశం యొక్క తదుపరి మరికొన్ని ఆధారాల ప్రకారం వారు సృష్టికర్త బ్రహ్మదేవుని తర్వాతి తరం వారు. వీరి తర్వాత అత్రి, సోమ (చంద్రుడు) అని తెల్ప బడింది. మరియు ఈ ప్రముఖ వంశం లో యదు, హైహయ మరియు కార్తవిర్య అర్జున వంటి ప్రముఖులు వచ్చారు. వారు కూడా హైహయల (చేడి) కుటుంబంగా గుర్తించబడ్డారు.

 

  ముందు పేజి తర్వాతి పేజి 

 





































back       began       home       next                         
 line
address