బిజ్జలదేవుడు : బిజ్జల వంశ స్థాపకుడు.

బిజ్జల /బిజ్జలదేవ కాలచూరుల వంశంనుంచి మొదలైనవారు, ఈ తెగను హహ్యాలు అని కూడా పిలుస్తారు. వీరు తూర్పు మాల్వా ప్రాంతాన్ని 8వ శతాబ్దంలో పాలించారు. ఈ వంశంలోని మిగతా వారు ఉత్తర భారత దేశంలో స్థిరపడ్డారు. ఈ వంశంలో ముఖ్యులు కొకళ్ళ-1 వీరు మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని పాలించారు, వీరు పదవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు. కాలచూరుల పాలనలో ముఖ్య సంస్థానాధీశులు. వీరు జయసింహ ను మరియు ఇతర రాజులను 1156లో ఓడించారు. వీరు చోళులు కళింగ యొక్క గంగా, ఇంక్యాలను మరియు త్రిపురీ కాలచూరుల ఇతర రాజులతో విజయవంతంగా పోరాడిరి. వీరు అంగ, వంగా, మగధ, నేపాల, తరుష్క మరియు సింహళ ప్రాంతాలను కూడా జయించారు. దీనితో 1157లో చాళుక్యుల రాజధాని కళ్యాణి ని బిజ్జులవారు కొనసాగించారు. ఇదే ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులలో గల బసవకల్యాణ. బీదర్ దీనికి దగ్గరి పట్టణం.

 

బిజ్జల వారు జైన మతాన్ని పాటించి హైదరాబద్ కి 80 కి. మీ. దూరం లోగల కొలనుపాక ను రాజధానిగా చేసుకొన్నారు. ఇది 50 కి. మీ. విస్తీర్ణంతో వ్యాపించి ఉన్న పెద్ద నగరం. ఇక్కడ బిజ్జలదేవుడు విశద పరిచిన జైన మాత కేంద్రం ఉంది. బిజ్జల దేవుడు జైనులకు మహారాజు కౌశికుడుగా పరిచయం. బిజ్జల వారి ప్రధాన మంత్రి ఐన బసవరాజు ఒక బ్రాహ్మణుడు ఐన వీరశైవ భక్తుడు. ఈయన వీరశైవ మతాన్ని స్థాపించారు. బిజ్జలదేవ మహారాజు బసవరాజు యొక్క సోదరి ఐన అక్క మహాదేవిని వివాహమాడిరి, ఈమె చాలా అందవతి, కొంత కాలం గడిచేసరికి బసవరాజు చాలా శక్తివంతంగా మారి వీరశైవ మతాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రచారం చేసేందుకు రాష్ట్రం యొక్క ఆర్ధిక సంపదను పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తాడు. జైనమతం యొక్క ప్రాపకం శిఖర స్థాయిలో ఉన్నప్పుడు, జైన మత ఆలయాల సంస్కరణ గందరగోళంలో పడుతుంది. అప్పుడు వీరశైవ అనుచరులకు జైనులకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం లో వీరశైవుల చేతిలో గ్రంధాలయాలు నాశనం చేయబడ్డాయి, మరియు ఎంతో అద్భుతమైన కొళంపాక నగరం నాశనం కావడానికి ఈ యుద్ధం కారణభూతమైంది.

 

రాణి అక్కమహాదేవి బిజ్జలదేవ యొక్క ప్రధాన రాణి. ఆమె వీర శైవ భక్తుడు మరియు స్థాపకుడు ఐన బసవరాజా సోదరి. ఈమె మైసూరు సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తున్న వీర శైవ మతానికి చెందిన ఒక బ్రాహ్మణ భక్తుడి కుమార్తె. జైనుల రాజైన కౌశికుడు (బిజ్జలదేవుడు) ఈమెను చూసి, ఈమె యొక్క అందం, భక్తి మరియు తెలివితేటలకు మోహితుడై ఆమెను తన రాణిగా చేసుకోవాలని నిర్ణయించుకొంటాడు. అతను తన మంత్రివర్గలో ఒకరిని ఈ వివాహ ప్రస్తావనను అక్కమహాదేవి తల్లి, తండ్రులకు తెలుపమని పంపుతారు, వారు జైన రాజైన ఇతనికి అక్కమహాదేవిని ఇవ్వడానికి నిరాకరిస్తారు. అప్పటికే బిజ్జల మహారాజు తనను బలవంతగా వివాహం చోసుకోవాలని అనుకుంటున్నాడని తెలుసుకొని, నిరాకరించిన తన తల్లి దండ్రులను ఒప్పించి వివాహంకోసం బిజ్జల రాజు పంపిన కాన్వాయ్ లోనే తన తల్లి తండ్రులతో కలిసి బిజ్జల సామ్రాజ్య రాజధాని ఐన కల్యాణికి వెడుతుంది. అప్పుడు అక్కమహాదేవి బిజ్జల రాజు కు నాకు ఇప్పటికే శివుడి తో వివాహమైనదని మిమ్మల్ని పెళ్లిచేసుకోలేనని మరియు రాజు ను వీరశైవ మతాన్ని ప్రచారం చేయడానికి ఒప్పిస్తుంది. తన సోదరుడైన బసవరాజు, ఇప్పటికే ఆ ఆస్థానంలో ఎంతో ప్రభావశీలుడైన శక్తి మంతుడైన ప్రధాన మంత్రి గా ఉంటారు. ఈ విధంగా అక్కమహాదేవి బిజ్జలదేవుడు వీరశైవ మతాన్ని ప్రచారం చేయడానికి కారణమౌతుంది. అక్కమహాదేవి చాలా గౌరవప్రదమైన మహిళ, మరియు అకుంఠిత శివ భక్తురాలు. ఆమె కళ్యాణి నగరంలోని అనుభవ మండపం లో శ్రీశైల మల్లికార్జునుడి దైవ పూజలో ఎక్కువ సమయం గడిపేవారు. తరువాత రాణి అక్కమహాదేవి, శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో ధ్యానం చేసేది, మరియు ఈమె అక్కడే శ్రీశైల మల్లికార్జున స్వామిలో కలిసి శివైక్యం చెందుతారు. నేటికీ కూడా కర్ణాటక రాష్ట్రంలో  అక్కమహాదేవి రచనలు చాలా ప్రసిద్ధి చెందాయి. అందులో "శివ శరణం" అనేది ప్రాచుర్యం పొందింది. శ్రీశైలం లో ఆమె యొక్క విగ్రహం ఉంది, ఇది భక్తులచే పూజలందుకొంటుంది.         

 

తర్వాతి పేజి


 




























































back       began       home       next                         
 line
address